ఎన్టీఆర్‌ ‘గబ్బర్‌సింగ్‌’!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా ‘టెంపర్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే ఓకే చెప్పాడు.

 Ntr Second Movie With Harish Shankar-TeluguStop.com

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.ఇదే నెలలో ఆ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లాలని దర్శకుడు సుకుమార్‌ నిర్ణయించాడు.

వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్‌, సుకుమార్‌ల సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆ వెంటనే తనకు ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో జత కట్టేందుకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్న హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్‌, హరీష్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా హరీష్‌పై నమ్మకంతో ఎన్టీఆర్‌ మరో సినిమా ఆఫర్‌ను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే సంవత్సరం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.మరి రెండవ సినిమా అయినా సక్సెస్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube