రాజకీయాల్లోకి రావొద్దని ఎన్టీఆర్ గారు చెప్పి వెళ్లారు.. చలపతి రావు

Ntr Said That Did Not Come Into Politics Chalapathi Rao

సినీ పరిశ్రమలో అందర్నీ తాను ఒకేలా చూస్తానని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావం అస్సలు లేదని నటుడు చలపతిరావు స్పష్టం చేశారు.అలాగే బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు కూడా తనకు మంచి గౌరవం ఇస్తారని ఆయన చెప్పారు.

 Ntr Said That Did Not Come Into Politics Chalapathi Rao-TeluguStop.com

అంతే కాకుండా తాను వెళ్లి తనకు ఈ క్యారెక్టర్‌ కావాలని ఎవరినీ అడగనని ఆయన తెలిపారు.అది రామారావు నుంచి తనకు అలవడిందని ఆయన అన్నారు.

వచ్చింది చేయడం, లేదంటే ఖాళీగా ఉండడం అంతే తప్పా , నాకు ఈ వేషం కావాలని ఎప్పుడూ అడగనని చలపతిరావు స్పష్టం చేశారు.

 Ntr Said That Did Not Come Into Politics Chalapathi Rao-రాజకీయాల్లోకి రావొద్దని ఎన్టీఆర్ గారు చెప్పి వెళ్లారు.. చలపతి రావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా రామారావు గారు పార్టీ పెట్టినపుడు ఒకానోక సందర్భంలో అన్నయ్యా మీరు పార్టీలోకి వెళ్తున్నారు.

మేం కూడా పార్టీలోకి  రామా అని అడిగితే, వద్దు వద్దు.నేనిప్పటికే ఇందులో కూరుకుపోయాను.

మన వాళ్లందరికీ చెప్పు.మంచి వేషాలు వేసి, మంచి సినిమాలు తీయమను. ఈ పాలిటిక్స్ అంత దరిద్రం ఇంకోటి లేదు.ఎవరు పాలిటిక్స్ లోకి రావద్దని రామారావు తనతో చెప్పినట్టు చలపతిరావు అన్నారు.

ఆయన్ని ఎప్పుడూ దూరంగా పెట్టలేదని, ఆయన కనపడగానే ఐస్ అయిపోయి, ఆయనలో కలిసిపోతారని చలపతిరావు అన్నారు.కలెక్టర్ల దగ్గర్నుంచీ ఆయన కాళ్ల మీద పడేవారని ఆయన చెప్పారు.ఎవరూ కూడా ఆయన్ని అలా దూరం పెట్టడం లాంటివి జరగలేదని ఆయన వివరించారు.ఒకవేళ ఆయన డబ్బు తిన్న వాళ్లు గానీ, ఇంకెవరైనా గానీ ఆయన్ను దూరం పెట్టాలని చూస్తే వాళ్లు నాశనం అయిపోయేవారని ఈ సందర్భంగా నటుడు చలపతిరావు ఎన్టీరామారావు గురించి తెలిపారు.

#Chalapati Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube