స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగాలట  

Ntr Rrr Ramcharan Kommuram Bheem - Telugu Coronavirus, Kommuram Bheem, Lock Down, Ntr, Rajamouli, Ramcharan, Rrr, Tollywood

సినిమా ఇండస్ట్రీపై కరోనా ప్రభావం చాలా చూపించింది.ఎన్నో సినిమాల షూటింగ్స్‌ మద్యలో ఆగిపోయాయి.

 Ntr Rrr Ramcharan Kommuram Bheem

కొత్త సినిమా షూటింగ్స్‌ ప్రారంభం కాలేదు.కనీసం కొన్ని సినిమాల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌, ట్రైలర్‌లు కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.

అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి ఎన్టీఆర్‌ వీడియోను ఆయన బర్త్‌డేకు విడుదల చేయాలని భావించారు.కాని అది వర్కౌట్‌ కాలేదు.

స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగాలట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎన్టీఆర్‌ బర్త్‌డేకు ఫ్యాన్స్‌ నిరాశ చెందారు.

ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ లుక్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

కాని ఇప్పటి వరకు లాక్‌ డౌన్‌ అమలులో ఉండి ఏం చేయాలని పరిస్థితి నెలకొన్న కారణంగా ఎన్టీఆర్‌ వీడియోను ఇవ్వలేక పోతున్నాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.త్వరలోనే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం కొమురం భీమ్‌ వీడియోను విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూడు నెలల వరకు ఎన్టీఆర్‌ భీమ్‌ వీడియో రాదని అంటున్నారు.

జూన్‌ జులైలో సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్న జక్కన్న ఆ రెండు నెలల్లో ప్రత్యేకమైన సందర్బాలు ఏమీ లేవు కనుక భీమ్‌ వీడియో విడుదల చేయాలని భావించడం లేదట.కొమురం భీమ్‌ వీడియోను వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అంటే ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అప్పటి వరకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగాలంటూ మేకర్స్‌ చిన్న హింట్‌ ఇచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..