చరణ్ పోలీస్ అయితే మరి ఎన్టీఆర్ దొంగా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత సృష్టించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Ntr Role In Rrr, Ntr, Rrr, Ram Charan, Rajamouli-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆయన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.చరణ్ ఫస్ట్ లుక్ వీడియో‌కు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక తారక్ నటిస్తున్న కొమురం బీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరు ఆతృతగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు.

అల్లూరి సీతారామరాజును పోలీస్ పాత్రలో చూపెట్టిన జక్కన్న, మరి తారక్‌ను ఎలా చూపెట్టనున్నాడు.ఇప్పుడు ఇదే సందేహం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ రాజమౌళి సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు తారక్‌ను దొంగలా చూపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.మరి తారక్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube