ఎన్టీఆర్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ఆర్ఆర్ఆర్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.

 Ntr Video To Be A Surprise From Rrr, Ntr, Rrr, Rajamouli, Ram Charan, Ntr First-TeluguStop.com

అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే రామరాజు పాత్రకు సంబంధించిన చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ తారక్ పుట్టినరోజున రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు.త్వరలోనే ఈ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కాగా తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.అయితే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ టీమ్ సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తోందట.ప్రస్తుతం లాక్‌డౌన్‌ను సడలించడంతో సినిమా పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే తారక్ ఫస్ట్ లుక్ వీడియోను కూడా రెడీ చేస్తున్నారట జక్కన్న.

ఇది పూర్తయిన వెంటనే దీన్ని సడెన్‌గా రిలీజ్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు.మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ తారక్ వీడియోతో సంచలనం సృష్టించాలని చూస్తున్నట్లు మాత్రం స్పష్టం అవుతంది.

మరి ఈ ఫస్ట్ లుక్ వీడియో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే అది రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube