కొట్లాటకు రెడీ అయిన తారక్  

Ntr Rrr Rajamouli - Telugu Ntr, Rajamouli, Ram Charan, Rrr, Tollywood News

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టాడు దర్శకుడు రాజమౌళి.

 Ntr Rrr Rajamouli

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగిలిన షూటింగ్‌ను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఇప్పటికే అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది.

కొట్లాటకు రెడీ అయిన తారక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పుడు షూటింగ్ జరుపుకునేందుకు అనుమతి లభించడంతో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

ఇందులో భాగంగా ఇద్దరు హీరోల మధ్య సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు.దీనికి సంబంధించి ఇద్దరు హీరోలు ఫిట్‌గా ఉండేందుకు తమ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున జిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఎవరిపై ఎవరు గెలుస్తారనే అంశం చాలా కీలకంగా మారింది.మరి ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఇద్దరు హీరోలు ఎలా తలబడబోతున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Rrr Rajamouli Related Telugu News,Photos/Pics,Images..

footer-test