ఏడాదికో గిఫ్ట్ అంటోన్న తారక్.. అయ్యే పనేనా?  

Ntr Rrr Ntr30 - Telugu Ntr, Ntr30, Prashanth Neel, Rrr, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 Ntr Rrr Ntr30

ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.

అయితే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన తారక్, త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

ఏడాదికో గిఫ్ట్ అంటోన్న తారక్.. అయ్యే పనేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా మొదలుకాక ముందే తన నెక్ట్స్ మూవీని కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిపాడట.

అయితే ఆర్ఆర్ఆర్‌ను 2021లో రిలీజ్ చేసి, ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా చేయడం, దాన్ని 2022లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

ఇక ప్రశాంత్ నీల్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2023లో ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి తారక్ ఏడాదికో గిఫ్ట్ తన ఫ్యాన్స్‌కు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని చెప్పాలి.ఇంకో విశేషమేమిటంటే, ఇలాంటి భారీ సినిమాలు లైన్‌లో పెట్టిన ఘనత ఖచ్చితంగా టాలీవుడ్‌లో తారక్‌కు మాత్రమే ఉందని చెప్పాలి.

ఇక ఆర్ఆర్ఆర్ నుండి తారక్ ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr To Release One Movie Every Year Related Telugu News,Photos/Pics,Images..