ఎన్టీఆర్‌ ఎందుకు ఇంత తొందర?  

Ntr Rrr Ntr And Trivikram Ntr Fans Ntr 31st Movie - Telugu Ntr, Ntr 31st Movie, Ntr And Trivikram, Ntr Fans, Rrr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ రెండేళ్ల పాటు డేట్లు కేటాయించాడు.

 Ntr Rrr Ntr And Trivikram Ntr Fans Ntr 31st Movie

త్వరలోనే త్రివిక్రమ్‌తో ఈయన మూవీ ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ఎందుకు ఇంత తొందర-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎన్టీఆర్‌ 30 చిత్రం ఇంకా పట్టాలెక్కకుండానే అప్పుడే ఎన్టీఆర్‌31వ చిత్రంకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ దర్శకుడు ఎన్టీఆర్‌కు కథ వినిపించాడని ఆ స్టోరీ లైన్‌ నచ్చడంతో చేసేందుకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రారంభించి దసరాకు సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి కూడా అప్పుడే ఎన్టీఆర్‌ వచ్చాడని సమాచారం అందుతోంది.

రెండేళ్ల గ్యాప్‌ను ఎన్టీఆర్‌ చక చక సినిమాలు చేయడం ద్వారా ఫిల్‌ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్‌ 30వ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది.31వ చిత్రం వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలా ఒకే ఏడాది రెండు సినిమాలను విడుదల చేయడం వల్ల ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో వచ్చిన గ్యాప్‌ కాస్త అయినా ఫిల్‌ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.

అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఎందుకు ఇంత తొందర అంటున్నారు.తొందరలో క్వాలిటీ మిస్‌ అయితే ఫ్లాప్‌ తప్పదంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..