ఎన్టీఆర్ షాట్‌ను తీసేయాలంటూ డిమాండ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు ముందే ప్రభంజనం సృష్టిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుండి హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 Komuram Bheem Grandson Demands To Delete Ntr Shot, Ntr, Rrr, Komuram Bheem, Rrr-TeluguStop.com

అయితే ఈ టీజర్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది.కాగా ఈ టీజర్లు పలు రికార్డులతో పాటు సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి.

రీసెంట్‌గా దసరా కానుకగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్‌లో ఓ షాట్‌లో ఎన్టీఆర్ ముస్లిం మతానికి చెందిన టోపీ పెట్టుకుని కనిపిస్తాడు.

ఇప్పుడు ఈ షాట్ సరికొత్త వివాదానికి తెరలేపింది.గోండు జాతికి చెందిన ఆదివాసి కొమురం భీం ముస్లిం పాలకులపై తిరుగుబాటు చేసిన సంగతి మరిచి, ఆయన పాత్రకు టోపీ పెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదానికి కారణమైన సదరు షాట్‌ను ఆర్ఆర్ఆర్ టీజర్ నుండి వెంటనే తొలగించాలంటూ కొమురం భీం మనవడు సోనె రావు డిమాండ్ చేస్తున్నాడు.తమ కుటుంబ సభ్యులను ఏమాత్రం సంప్రదించకుండా కొమురం భీం పాత్రను ఎలా తెరకెక్కిస్తారని వారు రాజమౌళి అండ్ టీమ్‌పై మండిపడుతున్నారు.

ఏదేమైనా ఆదివాసి జాతికి చెందిన పలువురు ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ సినిమా రిలీజ్‌ను వారు అడ్డుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.అయితే ఈ వివాదంపై దర్శకుడు రాజమౌళి, చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.

ఇక కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్, అటు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా ఈ వివాదంపై నోరుమెదపలేదు.మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube