అనుకున్నదే అయ్యింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన జక్కన్న

గత నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి రామ రాజు వీడియో వచ్చిన విషయం తెలిసిందే.ఆ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.

 Ntr Rrr Latest Update About Ntr Kommuram Bheem Teaser, Ntr, Rrr, Kommuram Bheem,-TeluguStop.com

అప్పటి నుండి కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు వీడియో కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తూ వస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ వీడియో రాదు అంటూ చాలా మంది అనుకున్నారు.

కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకం తో ఎదురు చూశారు.

కొందరు అన్నట్లుగానే రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు.

లాక్ డౌన్ ను మళ్ళీ పొడగించిన కారణంగా సినిమా పనులు ఏమి జరగడం లేదు.కనుక ఎన్టీఆర్ వీడియో ను విడుదల చేయలేక పోతున్నాము.

ఎదో ఒకటి విడుదల చేయాలని అనుకోవడం లేదు.ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు.

పరిస్థితిలు సర్దుమణిగిన తర్వాత తప్పకుండ ఫ్యాన్స్ కు మంచి వీడియో ను ఇస్తామని హామీ ఇచ్చారు.

Telugu Coronavirus, Kommuram Bheem, Lock, Ntr Fans, Rajamouli-Movie

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఎలా స్పందించబోతున్నారు అనేది చూడాలి.ప్రపంచం మొత్తం స్తంభించిన ఈ సమయంలో ఇలాంటి ప్రకటనను మేము ముందే ఊహించాము అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం జక్కన్న మోసం చేసాడు అంటూ తీవ్ర స్వరంతో విమర్శలు చేస్తున్నారు.జూన్ లేదా జులై లో ఈ సినిమా తాలూకు ఎన్టీఆర్ లుక్ మరియు వీడియో విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube