రెండేళ్ల వరకు నో అంటోన్న తారక్  

Ntr Rrr - Telugu Ntr, Ntr30, Prashanth Neel, Rajamouli, Rrr, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వచ్చే జనవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

 Ntr Rrr

కాగా ఈ సినిమా పూర్తికాక ముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ప్రారంభించాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేశారు.

అయితే మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్.కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.కాగా 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చయని తారక్, 2020లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు.

రెండేళ్ల వరకు నో అంటోన్న తారక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ ఏడాదిలో కూడా తారక్ నుండి సినిమా రావడం లేదు.దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు.

కాగా వారికి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.2021లో తొలుత ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేసిన తారక్, ఆ తరువాత 2021 ముగింపు కల్లా త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈ రెండు సినిమాలు రిలీజ్ చేసి 2021లోనే తన నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టడమే కాకుండా దాన్ని ఎట్టిపరిస్థితుల్లో 2022లో రిలీజ్ చేసేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.ఈ లెక్కన తారక్ మరో రెండేళ్ల వరకు రెస్ట్ తీసుకునే సూచనలు కనిపించడమే లేదని నందమూరి అభిమానులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test