పవర్ స్టార్ సినిమాల్లో ఎన్టీఆర్ కు ఆ సినిమా అంటే ఇష్టమట!

Ntr Reveals Pawan Kalyan Favorite Movie Name

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు జెమినీ టివిలో ప్రసారం అవుతున్న ”ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తారక్ తన హోస్టింగ్ తో అలరిస్తునే తన యాంకరింగ్ తో ఈ షో ను టాప్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

 Ntr Reveals Pawan Kalyan Favorite Movie Name-TeluguStop.com

ఈ షోలో మొదటిసారి వ్యాఖ్యాతగా పాల్గొంటున్న తన వాక్ చాతుర్యంతో ఈ షో రేటింగ్స్ ను నిలకడగా ఉండేలా చేస్తున్నాడు.

ఇక అప్పుడప్పుడు సెలెబ్రిటీలను కూడా ఈ షోకు ఆహ్వానించి వారితో కూడా గేమ్ ఆడిస్తున్నాడు తారక్.

 Ntr Reveals Pawan Kalyan Favorite Movie Name-పవర్ స్టార్ సినిమాల్లో ఎన్టీఆర్ కు ఆ సినిమా అంటే ఇష్టమట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ షోలో తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ షోలో ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోసినిమా అంటే ఇష్టం అనే టాపిక్ వచ్చింది.

దీనికి తారక్ ఆన్సర్ కూడా చేసాడు.పవన్ నటించిన సినిమాల్లో తారక్ కు ”తొలిప్రేమ” సినిమా అంటే ఇష్టమట.

ఈ ఆన్సర్ అటు పవర్ స్టార్ అభిమానులను, ఇటు తారక్ అభిమానులకు కూడా నచ్చింది.

Telugu Tholi Prema, Evarumeelo, Koratala, Ntr Favorite, Ntrreveals, Pawan Kalyan, Rajamouli-Movie

ఈ షో ద్వారా తారక్ అలా చెప్పడంతో ఇరు అభిమానుల మధ్య మంచి సంబంధాలు కొనసాగే అవకాశాలు ఎక్కువ అవుతాయి.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.ఎన్టీఆర్ ప్రెసెంట్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

Telugu Tholi Prema, Evarumeelo, Koratala, Ntr Favorite, Ntrreveals, Pawan Kalyan, Rajamouli-Movie

సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచారు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.వచ్చే నెల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాను కొరటాల శివ భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించ బోతున్నాడు.

ప్రెసెంట్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

#Pawan Kalyan #EvaruMeelo #Favorite #Koratala #Tholi Prema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube