ఎన్టీఆర్‌ బర్త్‌డే కి ఆ రెండింటిలో దేన్ని తీసుకు రాబోతున్నారు?

దర్శకుడు రాజమౌళి సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో ప్రమోషన్‌ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు వహిస్తాడనే విషయం తెల్సిందే.ప్రమోషన్‌ విషయంలో జక్కన్న ట్రెండ్‌ సెట్‌ చేశాడు.

 Ntr Birthday Special Rajamouli Release The Rrr Teaser Ntr, Ramcharan, Rajamouli,-TeluguStop.com

తన ప్రతి సినిమా ప్రమోషన్‌ విషయంలో కొత్త పుంతలు తొక్కే విధంగా జక్కన్న పబ్లిసిటీ కార్యక్రమాలు చేయడం.పోస్టర్స్‌ టీజర్స్‌ విడుదల చేయడం చేస్తాడు.

ప్రస్తుతం జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా 9 నెలలు ఉంది.అయినా కూడా అప్పుడే టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నాడట.

ఆ విషయమై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.లాక్‌డౌన్‌కు ముందే టీజర్‌ విషయంలో చర్చలు జరిగాయి.

కొంత మేరకు ఎడిటింగ్‌ కూడా పూర్తి అయ్యిందట.మరో రెండు మూడు రోజుల వర్క్‌తో టీజర్‌ పని పూర్తి అవ్వనుందట.

అయితే ఈ టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ బర్త్‌డేకు టీజర్‌ వస్తుందని అంటున్నారు.

Telugu Bheem Ramraju, Komaram Bheem, Ntr, Rajamouli, Ramcharan, Teasers Ntr-Movi

మొన్న చరణ్‌ బర్త్‌డేకు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో భీమ్‌ ఫర్‌ రామరాజు వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక వచ్చే నెలలో రాబోతున్న ఎన్టీఆర్‌ బర్త్‌డేకు చరణ్‌ వాయిస్‌తో వీడియో వస్తుందని అంతా అనుకున్నారు.కాని ఎన్టీఆర్‌ వీడియో కాకుండా సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్‌ను విడుదల చేయాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడట.

సినిమా విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్‌ ఒక అంచనాకు వచ్చి ఉన్నారు.ఆ అంచనాను మరింత పెంచేలా టీజర్‌ ఉంటుందట.

Telugu Bheem Ramraju, Komaram Bheem, Ntr, Rajamouli, Ramcharan, Teasers Ntr-Movi

సినిమా కోసం రెండు టీజర్‌లు ఉంటాయని అంటున్నారు.ఎన్టీఆర్‌ బర్త్‌డేకు వచ్చే టీజర్‌లో పూర్తిగా ఎన్టీఆర్‌ ఉంటాడని అంటున్నారు.ఆ తర్వాత చరణ్‌ టీజర్‌ కూడా రాబోతున్నట్లుగా చెబుతున్నారు.కాని కొందరు మాత్రం కొమురం భీం మేకింగ్‌ వీడియోనే వస్తుందని అంటున్నారు.మరి టీజర్‌, మేకింగ్‌ వీడియోల్లో ఏది ప్రేక్షకుల ముందుకు రాబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube