మహేష్‌ను ఢీకొట్టేందుకు ఆర్ఆర్ఆర్ బ్యాచ్‌తో దిగుతున్న బన్నీ  

Ntr Ram Charan To Promote Ala Vaikuntapuramulo-allu Arjun,mahesh Babu,ntr,ram Charan,sarileru Neekevvaru

సంక్రాంతి సందడి తెలుగు బాక్సాఫీస్ వద్ద అప్పుడే మైదలైంది.జనవరి 9న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం రిలీజ్ కాగా అది యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

NTR Ram Charan To Promote Ala Vaikuntapuramulo-Allu Arjun Mahesh Babu Ntr Ram Sarileru Neekevvaru

ఇక భారీ అంచనాల నడుమ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు అన్ని చోట్లా అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది.

మహేష్ పర్ఫార్మెన్స్‌ కోసం ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.కాగా ఈ సినిమాకు ఇంతటి రెస్పాన్స్ వస్తుండటంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

దీంతో ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు బన్నీ మాస్టర్ ప్లాన్ వేశాడు.ఈ సినిమాను నేడు స్పెషల్ స్క్రీనింగ్ వేయించి, ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు చూపించి వారితో ప్రమోట్ చేయించాలని చూస్తు్న్నారు.

దీంతో చిత్రానికి మరింత హైప్ తీసుకురావచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర మూవీకి తారక్, చరణ్‌ల ప్రమోషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

ఏదేమైనా మహేష్‌ను ఢీకొట్టేందుకు ఆర్ఆర్ఆర్ బ్యాచ్‌ను బన్నీ దించుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Ntr Ram Charan To Promote Ala Vaikuntapuramulo-allu Arjun,mahesh Babu,ntr,ram Charan,sarileru Neekevvaru Related....