ఆర్ఆర్ఆర్ హీరోలు కలిసేది ఉందా లేదా?

టాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Ntr Ram Charan To Meet In Rrr-TeluguStop.com

అయితే ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో వారి గెటప్‌లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి కనిపిస్తారా అనే సందేహం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి కొమురం భీం, అల్లూరి సీతారామరాజులు భిన్న ప్రాంతాలకు చెందినవారు.

వారు కలిసిన దాఖలాలు లేవు.అయితే వారిద్దరు కలిసేందుకు ఒక్క అవకాశం మాత్రమే ఉందని చరిత్రకారులు అంటున్నారు.

కొమురం భీమ్, సీతారామరాజులు కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సమయంలోనే వారిద్దరు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ అంశాన్నే ఉపయోగించుకొని రాజమౌళి తారక్-చరణ్‌లను కలిపి చూపిస్తాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.అయితే ఈ వార్తపై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వారకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube