అమెరికాలో ఆర్ఆర్ఆర్ కోసం డిస్కౌంట్స్ మొదలు పెట్టారు

ఎప్పుడెప్పుడా అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎదురు చూసిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాహుబలి 2 రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఆశించారు ప్రతి ఒక్కరు.

 Ntr Ram Charan Rrr Movie Usa Collections And Ticket Price Details, Ntr, Ram Char-TeluguStop.com

ఏమాత్రం అసంతృప్తి చెందకుండా అదే స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసింది ఈ సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా ఒక అద్భుతం అంటూ ఈ సినిమా మరో సారి నిరూపించింది.

ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ విషయాలు ప్రతి చోట కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏ సినిమా కూడా సాధించని కలెక్షన్స్ ను నమోదు చేసింది.

ఇక అమెరికాలో ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో జాయిన్ అయినందుకు సిద్ధమైంది.ఈ సినిమా విడుదలై రెండు వారాలు కాబోతున్న నేపథ్యం లో వసూళ్లు కాస్త నెమ్మదించిన దాంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు యూనిట్‌ సభ్యులు మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

అమెరికా లో ఈ సినిమా టికెట్ ధర ను తగ్గించి ప్రేక్షకులకు అందుబాటు లోకి తీసుకొస్తున్నట్లు గా ప్రకటించారు.అమెరికా మొత్తం లో కూడా సినిమా విడుదల సమయం లో ఉన్న టికెట్ల రేటుకి దాదాపు గా 30 నుండి 40 శాతం వరకు టికెట్ రేటు తగ్గించినట్లు గా సమాచారం అందుతోంది.

Telugu Bahubali, Rajamouli, Ram Charan, Rrr, Rrr Usa-Movie

దీంతో మరో సారి అమెరికా లో ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకుంటాయని తద్వారా వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందంటూ నమ్మకంగా ఉన్నారు బాహుబలి 2 వసూళ్లను అమెరికాలో ఈ సినిమా బ్రేక్‌ చేస్తుందా అంటే అనుమానమే.అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ పని చేస్తే మాత్రం కచ్చితంగా బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ను జక్కన్న మరోసారి బ్రేక్ చేసి సరి కొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఉత్తర భారతంలో ఇప్పటికే ఈ సినిమా రెండు వందల కోట్ల పైగా దక్కించుకొని సరి కొత్త అధ్యయం లిక్కించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube