బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ‘RRR’..!!

“RRR” మూవీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్ దక్కించుకుంది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “నాటు నాటు” పాటకు గాను ఫైనల్ లిస్టులో ఈ నామినేషన్ దక్కింది.దీంతో మార్చిలో ప్రకటించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని భారతీయ సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.“నాటు నాటు” పాటకు ఇప్పటికే “గోల్డెన్ గ్లోబ్” అవార్డు రావడం జరిగింది.దీంతో ఇదే రీతిలో ఆస్కార్ కూడా గెలవాలని తెలుగు సినిమా ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

 బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ నామిన-TeluguStop.com

“RRR”. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలవడం జరిగింది.ఈ సినిమా ప్రపంచ స్థాయిలో భారతీయ చలనచిత్రా రంగం యొక్క ఖ్యాతిని పెంచింది.ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళికి విపరీతమైన పేరు వచ్చింది.ప్రపంచ టాప్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం ఈ సినిమాని రెండుసార్లు చూసి రాజమౌళిని పొగడటం జరిగింది.

ఇండియాలో ₹1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన “RRR”.

Telugu Original, Natu Natu, Natu Natu Oscar, Oscar Awards, Rajamouli, Ram Charan

ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది.ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు జక్కన్నతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.ఊహించని రీతిలో “RRR” ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.

దీంతో ఈ సినిమాకి ఆస్కార్ రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎప్పటినుండో కోరుతున్నారు.ఈ క్రమంలో ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లో చోటు దక్కించుకోవడంతో ఫుల్ ఆనందంగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube