పులితో టైగర్ ఫైట్.. ఆందోళనలో ఆర్ఆర్ఆర్ యూనిట్  

Ntr Pic Leaked From Rrr Shooting-rajamouli,ram Charan,rrr,shooting,telugu Movie News

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం ముగిసిందని, చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుక రెడీ అవుతున్నారు జక్కన్న.

NTR Pic Leaked From RRR Shooting-Rajamouli Ram Charan Rrr Shooting Telugu Movie News

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఈ ఫోటోల్లో తారక్ ఓ పులితో పోరాడుతున్న ఫోటో ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో చిత్ర యూనిట్ ఖంగుతిన్నారు.వెంటనే అప్రమత్తమై కాపీరైట్ ఇష్యూ కింద దానిని ఆన్‌లైన్ నుండి తొలగించారు.

ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన వారు తారక్ లుక్ కేక అంటూ కితాబిస్తున్నారు.

పెద్ద సినిమాలకు లీకుల గోల ఎప్పటికీ ఉంటుందని, వాటిని అరికట్టేందుకే చిత్ర షూటింగ్ స్పాట్‌కు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక జూలై 30న రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌కు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్‌ మాత్రం పీక్స్ అంటున్నారు సినీ జనం.

తాజా వార్తలు