సెలెబ్రెటీలకు స్పోర్ట్స్ బైక్ లన్నా లేదా కార్లన్నా చాలా ఇష్టం.చాలా మంది మార్కెట్ లోకి వచ్చిన ప్రతి మోడల్ ను ట్రై చేయాలనీ అనుకుంటుంటారు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే పని చేస్తున్నాడు.మాములుగా ఎన్టీఆర్ కు కార్లు అంటే విపరీతమైన పిచ్చి.
ఎప్పుడూ కొత్త కొత్త కార్లను వాడుతుంటాడు.సంవత్సరానికి ఒక కారును మార్చుతుంటాడు.
అయితే తాజాగా ఎన్టీఆర్ ఒక కొత్త కారు కొన్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న టాక్.
ఈ కారు ఇండియా లో దొరకకపోయిన ఫారిన్ నుండి తెప్పిస్తున్నాడట.
అయితే ఇప్పుడు ఆ కారు ధర గురించి పెద్ద చర్చ జరుగుతుంది.ఆ కారు ధరతో ఒక చిన్న సినిమా కూడా తెరకెక్కించవచ్చని కూడా అంటున్నారు.
ఆ కారు విలువ అక్షరాలా ఐదు కోట్లు వరకు ఉంటుందట.దీనిని స్పెషల్ గా ఎన్టీఆర్ తెప్పించుకుంటున్నాడట.
ఎన్టీఆర్ ఈ కారును అప్పుడే బుక్ చేసుకున్నాడట.త్వరలోనే ఈ కారును ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం ఇటలీ నుండి తెప్పిస్తున్నారట ఇంతకీ 5 కోట్లు ఖరీదైన ఆ కారు పేరు ఏంటో అని అనుకుంటున్నారా ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్.ఇది ఒక స్పోర్ట్స్ కారు.ఈ కేర్ కేవలం రోడ్డు మీద మాత్రమే కాకుండా ఎడారి ప్రాంతంలో, కొండా ప్రాంతాలలో కూడా అంతే స్పీడ్ గా దూసుకుపోతుంది.
ఇంత ఖరీదైన కారును టాలీవుడ్ హీరోలు ఇప్పుడు వరకు అస్సలు వాడలేదు.ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.ఈ సినిమాను వరల్డ్ వైల్డ్ గా అక్టోబర్ 13 న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్లతో పనిచేయబోతున్నాడు.
.