నాన్నకు ప్రేమతో వలన ఎన్టీఆర్ కి ఇబ్బందులు

సుకుమార్ పుణ్యమో, సినిమా అలా కలిసి ఒచ్చిందో కానీ ఎప్పుడూ లేనిది ఓవర్ సీస్ లో దున్నేసాడు ఎన్టీఆర్.భీకరమైన పోటీ లో విడుదల చేసినా కూడా ఒక పక్క డిక్టేటర్ , ఎక్స్ ప్రెస్ రాజా , సోగ్గాడు కాంపిటీషన్ ఇస్తున్నా ఎన్టీఆర్ తనదైన శైలి లో దున్నేసాడు.

 Ntr Problems After Nannaku Prematho-TeluguStop.com

ఇక్కడ కంటే అక్కడ ప్రాఫిట్ లు బాగా వచ్చాయి.

యూఎస్ కలెక్షన్లలో టాలీవుడ్ టాప్ 3 స్టేజ్ కి నాన్నకు ప్రేమతో చేరిపోయింది.

అన్నీ బాగుంటే ఫుల్ రన్ లో రెండో ప్లేస్ కి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కావడంతో.

అక్కడ భారీ రేటుకే విక్రయించారు.యూఎస్ రైట్స్ ను 7 కోట్లకు అమ్మారు నిర్మాతలు.

దీన్ని రాబట్టాలంటే.ఖచ్చితంగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోవాల్సిందే.

ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ కు రాగలుగుతాడు.

నాన్నకు ప్రేమతోకు ఇది తేలికైన విషయమే.

అయితే.మరోసారి ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించగలడా అన్నదే అసలు ప్రశ్న.

అయితే ఇప్పుడు ఈ సినిమా వలన ఎన్టీఆర్ తరవాత సినిమా ‘ జనతా గ్యారేజ్ ‘ కి బాగా ఒత్తిడి వచ్చే అవకాసం ఉంది.ఇప్పుడు సుకుమార్ కారణంగా ఇంత కలెక్షన్స్ వచ్చాయన్నది సుస్పష్టం.

మరి కొరటాల డైరక్షన్ లో తెరకెక్కే మూవీకి ఇంత మొత్తం రాబట్టడం కొంచె కష్టం కావచ్చని అంటున్నారు.అందుకే ఈ సారి తన వ్యూహాన్ని ఎన్టీఆర్ ఛేంజ్ చేయాలని భావిస్తున్నాడట.

అదేంటీ అన్నది ఇప్పటికైతే ఇంకా రివీల్ చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube