తూచ్.. తారక్ సినిమా టైటిల్ అది కాదంటగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 Ntr Prashanth Neel Movie Title News Are Fake, Ntr, Prashanth Neel, Ntr31, Nuclea-TeluguStop.com

కాగా తారక్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడట.కన్నడలో కేజీఎఫ్ చిత్రంతో ఆలిండియాలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు తారక్ రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమా కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండటంతో దీనికి అంతే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ పెడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.ముఖ్యంగా ఈ సినిమాకు న్యూక్లియర్, మిసైల్ అనే టైటిళ్లను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా టైటిళ్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట చిత్ర యూనిట్.నిజానికి ఈ సినిమాను ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేయలేదు.

మరి ఇలాంటి సినిమాకు అప్పుడే టైటిల్ ఫిక్స్ చేశారనే వార్తలు ఎలా పుట్టుకు వస్తాయా అని సదరు దర్శకనిర్మాతలు వాపోతున్నారు.ఏదేమైనా ఈ టైటిల్స్ బాగానే ఉన్నాయని, సినిమా పట్టాలెక్కితే వీటిని ఖచ్చితంగా పరిశీలిస్తారని మేకర్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్‌ను ఆలిండియా స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు.అటు ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్, ఈ సినిమా పూర్తయ్యకే తారక్‌తో సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube