ఎన్టీఆర్ బర్త్ డేకు #NTR31 సినిమా అనౌన్స్ చేయబోతున్నారా..!

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 Ntr Prashanth Neel Movie Announcement On Ntr Birthday-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్ సరసన విదేశీ భామ నటిస్తుంటే, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంది.అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ ఉన్నారు.

Telugu Ntr, Ntrprashanth, Prashanth Neel-Latest News - Telugu

ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివతో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.

అయితే ఇప్పుడు మరొక సినిమా గురించి కూడా వార్తలు వస్తున్నాయి. #NTR31 సినిమాను ఆయన పుట్టినరోజు నాడు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతుందని టాక్.ఈ సినిమా గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అధికారికంగా ప్రకటించబోతున్నారని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube