తారక్ సినిమాలో హీరోయిన్ ఎలా ఉండాలంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే.

 Ntr Prashanth Neel Heroine To Be Like This, Ntr, Prashanth Neel, Heroine, Kgf, T-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి తారక్ తన 30వ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.అటు కన్నడలో కేజీఎఫ్ చిత్రంతో ఇండియావైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తారక్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాను పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.

అయితే తారక్ సినిమాలో అలా కుదరదు.ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ అంటే ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండాలి.

అంతేగాక తారక్‌తో సమానంగా అదిరిపోయే డ్యాన్స్ చేయగలిగే సత్తా కూడా ఉండాలి.ఇక తారక్‌తో డ్యుయెట్ పాటల్లో హీరోయిన్లు వేసే స్టెప్పుల కోసం కూడా కొంతమంది అభిమానులు ఉన్నారంటే, ఆయన సినిమాలో హీరోయిన్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉందో అర్ధం అవుతోంది.

మరి ఇలాంటి లక్షణాలు ఉన్న హీరోయిన్ పాత్రను ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అసలు తారక్ కోసం ఆయన ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటాడో తెలియాలంటే మాత్రం సినిమా మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube