ప్రభాస్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా ఎప్పుడో చెయ్యాల్సిన సినిమా.. ఇప్పటికి లేదు?

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాలో నటిస్తే ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ను మాత్రం వివరించడం కష్టం.ఎందుకంటే మల్టీస్టారర్ గా ఇప్పటికీ పలు సినిమాలు తెరకెక్కగా అవి మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

 Ntr Prabhas Multistarrer In Raghavendra Rao Direction Details,  Prabhas, Tollywo-TeluguStop.com

ఇదిలా ఉంటే యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ కూడా మల్టీస్టారర్ గా ఓ సినిమాలో ఎప్పుడో చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ సినిమా గురించి మళ్లీ ఎటువంటి టాక్ కూడా లేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా మల్టీ స్టారర్ గా నటిస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.గతంలో ఎన్టీఆర్, ప్రభాస్ తో కూడా ఓ స్టార్ డైరెక్టర్ ఓ సినిమా చేయాలని అనుకున్నారట.కానీ ఆ సినిమా గురించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు.

గతంలో డైరెక్టర్ రాఘవేంద్ర రావు తన దర్శకత్వంలో ‘పరుశరాముడు‘ అనే సినిమాకు ఓ కథను ప్లాన్ చేశాడట.ఆ సమయంలో ఈ సినిమా గురించి బాగా వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, ప్రభాస్ కలిసి చేయనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.ఈ కథను పౌరాణిక గాధ ఆధారంగా రూపొందించాలని అనుకున్నారట.

ఇక ఈ సినిమాలో రాముడు అనే కీలక పాత్రలో ఎన్టీఆర్ ను అడిగారట.ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పాడట.

Telugu Raghvendra Rao, Jr Ntr, Pan India, Parashuramudu, Prabhas, Prabhasntr, Ra

అప్పటికి ఎన్టీఆర్ మరో సినిమాతో బిజీగా ఉండగా ఆ సినిమా తర్వాతనే ఈ సినిమా చేయాలని అనుకున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక ప్రభాస్ కూడా మరో సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమాలో ఆయనకు పరశురాముడు అనే పాత్రను ఇవ్వాలని అనుకున్నారట.ఈ ఇద్దరు హీరోలను ఈ సినిమాకు తీసుకుంటే మంచి క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు కూడా అనుకున్నారట.

కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు తనను అప్పుడే పౌరాణిక వేషాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారట.

ఇక అప్పటి నుంచి మళ్లీ ఈ సినిమా గురించి ఎన్టీఆర్ స్పందించలేదని తెలిసింది.కానీ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ప్రభాస్ విశ్వామిత్రుడు అనే గెస్ట్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక వీరి కాంబినేషన్ లో మాత్రం సినిమా ఉంటే బాగుండేది అని అభిమానులు చాలాసార్లు అనుకున్నారు.

Telugu Raghvendra Rao, Jr Ntr, Pan India, Parashuramudu, Prabhas, Prabhasntr, Ra

ప్రభాస్ కూడా ఇప్పటివరకు మల్టీస్టారర్ గా ఏ సినిమాలో కూడా నటించలేదు.కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం రామ్ చరణ్ తో పాటు మల్టీ స్టారర్ గా నటిస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు మరి కొంతమంది దర్శకుల సినిమాలకు ఓకే చెప్పాడు.నిజానికి ప్రభాస్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు.ఎలాగైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పటికైనా ఒక సినిమా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube