ఎన్టీఆర్ బయోపిక్ లో 'బాలకృష్ణ' పాత్రను పోషించేది ఎవరో తెలుసా.? ఇక నందమూరి ఫాన్స్ కి పండగే.!   NTR Playing Balakrishna Role In NTR Biopic     2018-10-22   09:34:14  IST  Sainath G

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న “ఎన్ఠీఆర్ బయోపిక్” పై తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం రెండు భాగాల్లో నిర్మిస్త్తున్నారు. మొదటి భాగం ఎన్ఠీఆర్ సినీ జీవితం గురించి…రెండో భాగం రాజకీయ జీవితం గురించి. ఇప్పటికే ఈ చిత్రంపై సంబందించిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. నారా చంద్రబాబు గా రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వర రావు గారి లాగా సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు అందరి చూపు ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రలో ఎవరు నటిస్తున్నారా అని.? న్టీఆర్ తో స‌రితూగే రేంజ్ ఉన్న బాల‌య్య పాత్ర ఎవ‌రు చేస్తార‌నే దానిపై ఇప్పుడు సమాధానం వచ్చింది …ఆ పాత్రని పోషించేది ఎవరు అనేది చెబితే నందమూరి అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది … ఎన్టిఆర్ బయోపిక్ లో బాలయ్య పాత్ర పోషించేది తారక్ అని తెలుస్తోంది… ఈ విష‌యాన్ని కేవలం ప్రకటన మాత్రమే కాకుండా వారిద్దరూ కలసి ఉన్న ఒక లుక్ ని కూడా త్వరలో విడుదల చేస్తారని టాక్. ఇప్పటికే 5 రోజుల పాటు ఎన్టిఆర్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు …ఈ నెల 15 నుంచి 25 వరకు ఎన్టిఆర్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు యంగ్ టైగ‌ర్.

NTR Playing Balakrishna Role In Biopic-

అయితే ఈ షూటింగ్ కేవలం మొదటి భాగం అయిన కధానాయకుడుకు సంభందించిందేన‌ట‌. నెక్స్ట్ షెడ్యూల్ లో మహానాయకుడు కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ . బాలయ్య తారక్ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని వేచి చూసిన వారందరికీ వారిద్దరూ వెండితెరపై కలసి కనిపిస్తారు అంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. నందమూరి అభిమానులకి ఇది పెద్ద పండగే.

NTR Playing Balakrishna Role In Biopic-