ఫారిన్ పాపతో తారక్ చిందులు.. మామూలుగా ఉండదట!  

Ntr Olivia Morris Rrr - Telugu Ntr, Olivia Morris, Rajamouli, Rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Ntr Olivia Morris Rrr

అయితే ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండటంతో వారిద్దరి కాంబో ఎలా ఉంటుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

ఫారిన్ పాపతో తారక్ చిందులు.. మామూలుగా ఉండదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అటు తారక్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ నటిస్తుండటంతో వారిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, అతడిని ఇష్టపడే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో ఒలివియా మారిస్ నటిస్తుంది.

వారిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా తారక్-ఒలివియాల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్‌ను జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సాంగ్ ఈ సినిమాలోని పాటల్లోకెల్లా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కీరవాణి ఈ సాంగ్‌కు సంబంధించిన రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్‌లో ఫారిన్ పాపతో తారక్ వేయబోయే చిందులు ఓ రేంజ్‌లో ఉండనున్నాయని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Olivia Morris Rrr Related Telugu News,Photos/Pics,Images..

footer-test