న్యూక్లియర్ ప్లాంట్ సాక్షిగా తారక్‌తో కన్ఫం చేసిన కేజీఎఫ్ డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో సోషల్ మీడియాలో తారక్ పుట్టినరోజును ట్రెండింగ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.ఇక ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తారక్‌కు తమ విషెస్‌ను తెలుపగా, తారక్‌తో సినిమాలు చేస్తున్న స్టార్స్, డైరెక్టర్స్ ఆయనకు తమ శుభాకాంక్షలు తెలిపి దుమ్ములేపుతున్నారు.

 Prashanth Neel Confirms Ntr Next Movie With Tweet, Ntr, Ntr31, Prashanth Neel, R-TeluguStop.com

ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ఇతర భాషల డైరెక్టర్స్ వరకు అందరూ తారక్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.

అయితే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు తనదైన స్టయిల్‌లో విషెస్ చెప్పాడు.

‘న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో మొత్తానికి తెలిసింది.నెక్ట్స్ టైమ్ ఈ ఎనర్జీ పక్కన కూర్చునే ముందు నా రేడియేషన్ సూట్ వేసుకుని మరీ వస్తాను’ అంటూ తనదైన శైలిలో విషెస్ చెప్పుకొచ్చాడు.

ఇక ఎన్టీఆర్‌ను అతి త్వరలో కలువబోతున్నట్లు ప్రశాంత్ నీల్ అన్నారు.

అంటే, తారక్‌తో తన నెక్ట్స్ మూవీ ఖచ్చితంగా ఉండబోతుందనే సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా ప్రశాంత్ తెలిపాడు.

ఎన్టీఆర్‌ను న్యూక్లియర్ ప్లాంట్‌తో పోల్చడంలోనే ఆయన నటనపై ప్రశాంత్‌కు ఎలాంటి నమ్మకం ఉందో అర్ధం అవుతుందని, కేజీఎఫ్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రశాంత్, తమ అభిమాన హీరోతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో మొదలైంది.ఏదేమైనా ఈ ట్వీట్‌తో నందమూరి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube