2022లో ఎన్టీఆర్ జీరో.. అంతా ఆయన పుణ్యమే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 No Movie From Ntr In 2022, Ntr, Ntr31, Prashanth Neel, Rrr, Ntr30-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన తారక్, అటుపై మరో భారీ పాన్ ఇండియా మూవీని లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

కన్నడలో కేజీఎఫ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇక వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాను తొలుత ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని అనుకున్నా, లాక్‌డౌన్ కారణంగా వారి ప్రాజెక్టులు మరింత ఆలస్యం కావడంతో వీరి కాంబోలో రాబోయే సినిమా ప్రారంభం కూడా ఆలస్యం అయ్యింది.అయితే 2021 ఏడాది చివర్లో గాని, 2022 ప్రారంభంలో కానీ ఈ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది.అంటే 2022లో తారక్ నుండి రిలీజ్ అయ్యే సినిమా ఏదీ లేదని చెప్పాలి.2021లో త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేశాక, మళ్లీ తారక్ సినిమా ఉండబోయేది 2023లోనే.ఏదేమైనా తారక్ ఫ్యాన్స్‌కు ఇది చేదు వార్తే అని చెప్పాలి.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం తారక్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube