కొమురం భీం వీడియో ఉందా? లేదా?

ఈనెల 20వ తారీకున ఎన్టీఆర్‌ పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో హీరోగా చరణ్‌ తో కలిసి నటిస్తున్నాడు.

 Ntr Fans Waiting For Rrr Komaram Bheem Video, Ntr, Ram Charan, Rrr, Komaram Bhee-TeluguStop.com

ఈ చిత్రం నుండి ఇప్పటికే రామ్‌ చరణ్‌ రామరాజు వీడియో వచ్చింది.ఇక ఖచ్చితంగా ఎన్టీఆర్‌ బర్త్‌డే కొమురం భీమ్‌ వీడియో రాబోతుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రామరాజు వీడియో చూసిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం బాహుబలిని మించి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

కొమురం భీమ్‌ వీడియో సినిమాపై అంతకు మించిన అంచనాలు క్రియేట్‌ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు.

రాజమౌళి కొమురం భీమ్‌ వీడియోను విడుదల చేయడం సాధ్యం అయ్యేలా లేదు.లాక్‌డౌన్‌ కారణంగా టెక్నీషియన్స్‌ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో వీడియో మేకింగ్‌ చేయడం సాధ్యం కాదని అన్నాడట.

రాజమౌళి ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం మొదటి నుండి కొన్ని షాట్స్‌ ను రెడీ చేసి పెట్టాడు.కాని ఇప్పుడు అవి ఎడిటింగ్‌ కు సాధ్యం అయ్యేలా లేదట.

Telugu Komaram Bheem, Rajamouli, Ram Charan-Movie

ఎన్టీఆర్‌ బర్త్‌డేకు ఇంకా సమయం ఉంది.లాక్‌డౌన్‌ తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్‌ వచ్చినా కూడా వీడియో రెడీ చేసే అవకాశం ఉంది.మళ్లీ లాక్‌డౌన్‌ను పొడగించకుండా ఉంటే తప్పకుండా ఎన్టీఆర్‌ వీడియో వస్తుందనే నమ్మకంను సినిమా ఇండస్ట్రీ వారు వ్యక్తం చేస్తున్నారు.కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉంటుందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది.

ఫస్ట్‌లుక్‌పై ఆసక్తి లేదు.కేవలం వీడియో కోసమే ఎదురు చూస్తున్నారు.

మరి రాజమౌళి ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube