పెళ్లికి సిద్దమైన ఎన్టీఆర్ విలన్.. ప్రియురాలితో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్?

సినిమాకు హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో అందుకు తగ్గ విలన్ క్యారెక్టర్‌ కూడా అంతే ముఖ్యం.ఎంతో మంది హీరో అవుదామని వచ్చి.

 Ntr Movie Villain Ready For Marriagewith His Girlfriend Shakthi Movie, Villain,-TeluguStop.com

విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు.మరెంతో మంది విలన్‌ క్యారెక్టర్లు చేస .ఆ తర్వాత నటుడిగా ప్రశంసలు అందుకున్నవారూ ఉన్నారు.

అయితే కొందరు సినిమాతో ఫేమస్‌ అయితే.

మరికొందరేమో తన నటనతో ఆకట్టుకుంటారు.హిట్‌ కొట్టని మూవీస్‌ల్లోనూ బెస్ట్ ఫర్‌ఫార్మెన్స్‌ చూపించిన వాళ్లూ లేకపోలేదు.

ఇక విషయానికొస్తే.అలాంటి కోవకు చెందిన వ్యక్తే విద్యుత్ జమ్వాల్.

ఇతను ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు కోలీవుడ్‌లోనూ అగ్ర హీరోలకు ప్రతినాయకుడిగా నటించారు.తెలుగులో శక్తి, ఊసరవెల్లి వంటి కమర్షియల్ సినిమాలు అంతగా ఆడకపోయినా అతని టాలెంట్‌ అందరికీ అర్థమైంది.

దీంతో ఆ తర్వాత కోలీవుడ్‌లో కొన్నాళ్లలోనే బిజీగా మారిపోయారు.ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన తుపాకీ సినిమాలో ఉగ్రవాదిగా నటించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు.

Telugu Girlfriend, Jammwal, Kollywood, Shakthi, Tollywood, Uasaravelli, Villain-

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా .ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విద్యుత్ జమ్వాల్.ఇకపోతే సోషల్ మీడియాలోనూ ఇతనికి భారీగా ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.తన వ్యక్తిగత వివరాలను అభిప్రాయాలను మాత్రం చాలా తక్కువగానే పంచుకుంటాడు.

Telugu Girlfriend, Jammwal, Kollywood, Shakthi, Tollywood, Uasaravelli, Villain-

ఇదిలా ఉండగా.ఈ మధ్య కాలంలో జమ్వాల్ ప్రేమలో ఉన్నట్టు అనేక కథనాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ మార్క్ లా ఉన్న అందరి సందేహాన్ని.తాజాగా అది పటాపంచలు అయినట్టే తెలుస్తోంది. తన ప్రేయసి నందితా మహతానీతో కలిసి ఉన్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడంతో.ఆ ఊహాగానాలు నిజమేనని వెల్లడవుతోంది.

అయితే మూడు రోజుల క్రితం ఎవరికీ తెలియకుండా నిశ్చితార్థం జరుపుకున్న జమ్వాల్ తొందర్లోనే పెళ్లి కొడుకుగా చూస్తామని భిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు తమిళ సినిమాలతో బిజీ అయినటువంటి విద్యుత్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా తీరికలేకుండా గడుపుతున్నాడని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube