రెండు నెలలు నిషేదానికి గురైన ఎన్టీఆర్ సినిమా.. ఏదో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు సినిమాలలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే ఆ సినిమా కథ ను మార్చడం కానీ లేదా మధ్యలో ఆపివేయడం కానీ జరుగుతుంది.ఇక విమర్శ పరంగా ఏవైనా సినిమాలు ఉంటే మాత్రం వెంటనే బోర్డు నుండి ఆ సినిమా నిషేధించాలని నోటీస్ కూడా వస్తుంటుంది.

 Ntr Movie Banned For Two Months Do You Know Anything Details,  Jr Ntr, Tollywood-TeluguStop.com

అలా ఎన్టీఆర్ సినిమా కూడా రెండు నెలల నిషేధానికి గురయ్యింది.ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఈ కుటుంబం నుండి ఎంతో మంది వారసులు పరిచయమై స్టార్ హీరోలుగా ఎదిగారు.

పైగా వరుస అవకాశాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు.ఇదిలా ఉంటే ఈ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉండే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే.

ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన ఈ లోకంలో లేకున్నా సరే ఇప్పటికీ ఈయనను తలుచుకుంటూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు.

తాను నటించిన ప్రతి ఒక్క సినిమా మంచి సక్సెస్ లు అందుకున్నాయి.

Telugu Ap Cm, Balakrishna, Bhanumathi, Harikrishna, Jr Ntr, Tathamma Kala, Tolly

నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు.ఈయన తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 400 సినిమాలలో నటించాడు.దేవుళ్ళ పాత్రలలో ఈయనకు పోటీ ఎవరు లేరని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ చాలా వరకు ఎవరి మాటా వినడు.తనకు ఏది అనిపిస్తే అదే చేస్తుంటాడు.

నిజానికి ఆయనను ఎదిరించిన వాళ్ళు లేరనే చెప్పవచ్చు.సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమానం ఉంది.

ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలిచాడు.ఇక ఈయన నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన దర్శకత్వంలో రూపొందించిన సినిమా తాతమ్మకల.

Telugu Ap Cm, Balakrishna, Bhanumathi, Harikrishna, Jr Ntr, Tathamma Kala, Tolly

ఇక ఈ సినిమా విడుదల సమయానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్.ఈ సినిమా సమయంలో అనగా 1974లో దేశం మొత్తం కుటుంబ నియంత్రణ చర్చల గురించి జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి.ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా పిల్లలను కనవద్దని బాగా ప్రచారాలు జరిగాయి.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ ప్రచారాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడు.

దీంతో ఈ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు.

అలా ఈ సినిమాలోనే తన వారసులనే పరిచయం చేశాడు.ఇక ఈ సినిమాలో తాతమ్మ పాత్రలో భానుమతి రామకృష్ణ నటించగా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించాడు.

దీంతో మనవడికి పుట్టిన ఐదుగురు పిల్లలు ఐదు ప్రధాన సమస్యలకు పరిష్కారాలుగా ఉంటారు.

Telugu Ap Cm, Balakrishna, Bhanumathi, Harikrishna, Jr Ntr, Tathamma Kala, Tolly

దీంతో వ్యసనపరుడిగా హరికృష్ణ, తాతమ్మ కోరిక తీర్చే మనవడిగా బాలకృష్ణ నటించారు.పలువురు నటీనటులు కూడా ప్రధాన పాత్రలలోనే నటించారు.కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అడ్డంకులు వచ్చాయి.

ఈ సినిమాను రెండు నెలలు నిషేధం అని ప్రకటించారు.ఇక అసెంబ్లీ లో కూడా ఈ సినిమా గురించి బాగా చర్చలు జరిగాయి.

కానీ ఎన్టీఆర్ మాత్రం అన్ని ఎదుర్కొని ధైర్యం తో 1974 ఈ సినిమాను విడుదల చేశారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని మంచి లాభాలను అందించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube