ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్‌కు రంగం సిద్ధం  

Ntr Meera Chopra - Telugu Ktr, Meera Chopra, Ntr, Ntr Fans, Tollywood News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి ఫిక్షన్ సినిమాగా జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Ntr Meera Chopra

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.అయితే సోషల్ మీడియా వేదికగా నటి మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం నడుస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పులమార్లు వెల్లడించిన మీరా చోప్రా, వారు తనను బెదిరిస్తున్నారని, సామూహిక అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందని ఆమె పోలీసులను ఆశ్రయించింది.కాగా ఈమేరకు ఆమె తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసింది.

దీంతో కేటీఆర్ ఆమె భద్రతకు సంబంధించి పోలీసులను ఆమెకు రక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.దీంతో మీరా చోప్పాపై దాడికి దిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్‌కు రంగం సిద్ధం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా 15 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను వారు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే వారికి పోలీసు నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ బాబును మీరా చెప్రా పొగిడినందుకే ఈ వివాదం చెలరేగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ పోలీసులను కోరుతున్నారు.మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test