ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ః ఎన్టీఆర్ బుల్లి తెరపై ఈసారి ఊరించి ఉసూరుమనిపించడట

స్టార్‌ లు సూపర్ స్టార్ లు వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే.ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ స్టార్స్ బుల్లి తెరపై కనిపించారు.

 Ntr Meelo Evaru Kotishwarudu Show Interesting Update-TeluguStop.com

ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్ షో లో కనిపించి మెప్పించాడు.ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ ఒక్క సీజన్ మాత్రమే చేసి ఆ తర్వాత కనిపించకుండా ఉసూరుమనిపించాడు.

ఇక జెనిమి టీవీ కోసం ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈసారి కూడా ఎన్టీఆర్‌ ఒక్క సీజన్‌ చేసి వదిలేస్తాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 Ntr Meelo Evaru Kotishwarudu Show Interesting Update-ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ః ఎన్టీఆర్ బుల్లి తెరపై ఈసారి ఊరించి ఉసూరుమనిపించడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని జెమిని ఛానెల్‌ వారు ఎన్టీఆర్‌ ఒక్క సీజన్‌ చేసి వదిలేయకుండా ఆయన్ను మూడు సీజన్‌ ల వరకు బుక్‌ చేసినట్లుగా తెలుస్తోంది.పది నెలల గ్యాప్‌ తో మూడు సీజన్ లను చేసేందుకు గాను ఎన్టీఆర్‌ జెమిని టీవీ ల మద్య ఒప్పందం జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

దాంతో ఎన్టీఆర్‌ మూడు సీజన్ ల వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో జెమిని టీవీలో కనిపించబోతున్నాడు.

బిగ్‌ బాస్‌ కేవలం ఒకే సీజన్ లో కనిపించడం వల్ల ఆయన స్థానంలో వచ్చిన మరొకరు ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో పాటు మొత్తం షో పై ఆసక్తి తగ్గింది.

అందుకే ఎన్టీఆర్‌ ను ఈ సీజన్‌ ల కోసం ముందస్తుగానే బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. షో సక్సెస్‌ అయితే మరిన్ని సీజన్‌ లు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 కంటే రెట్టింపు రేటింగ్‌ ను దక్కించుకునేలా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంను జెమిని వారు ప్రమోట్‌ చేయబోతున్నారు.ఇప్పటికే షో కు సంబంధించిన ప్రోమోను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో షూట్ చేశారు.

మరో వారం పది రోజుల్లోనే ఈ ప్రోమో ను జెమిని టీవీ ప్రసారం చేయబోతుంది.

#NtrMeelo #StarMaa #Gemini TV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు