'మహానాయకుడు'ను ఫ్రీగా ఇచ్చేస్తున్నారు... బాలయ్య నిండా మునిగేనా?  

  • నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ ను రెండు పార్ట్‌లుగా విడుదల చేసి బాగా క్యాష్‌ చేసుకోవాలని నిర్మాత బాలకృష్ణ భావించాడు. అందులో భాగంగా ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రాన్ని మంచి రేటుకు అమ్మాడు. అయితే సినిమాకు భారీగా ఖర్చు చేసిన కారణంగా పెట్టిన పెట్టుబడి రికవరీ కాలేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాతో లోటును భర్తీ చేయడంతో పాటు లాభాలను దక్కించుకోవాలని భావించాడు. కాని అనూహ్యంగా వర్మ ఇచ్చిన షాక్‌తో బాలకృష్ణ విలవిలలాడిపోతున్నాడు.

  • వర్మ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మహానాయకుడి చిత్రానికి పోటీగా వర్మ సినిమా విడుదల కాబోతుంది. దాంతో ఇప్పుడు బాలయ్య మూవీ కంటే వర్మ మూవీకే క్రేజ్‌ ఎక్కువ ఉంది. ఆ కారణంగా బయ్యర్లు మహానాయకుడు సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పర్వాలేదు అన్నట్లుగా ఉన్న కథానాయకుడు సినిమా ఏమాత్రం వసూళ్లను రాబట్టలేక పోయింది. ఇప్పుడు మహానాయకుడు సినిమాపై అసలు అంచనాలు లేవు, పైగా బలమైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రాబోతుంది. ఈ నేపథ్యంలో బయ్యర్లు డబ్బులు వృదా చేసుకోవాలనుకోవడం లేదు.

  • NTR Mahanayakudu Rights Available For Free?-Free To Distributors Lakshmis Ntr Movie Ntr Bio Pic

    NTR Mahanayakudu Rights Available For Free..?

  • బయ్యర్లు ముందుకు రాకపోవడంతో కథానాయకుడు డిస్ట్రిబ్యూట్‌ చేసిన బయ్యర్లకే మహానాయకుడు సినిమాను ఫ్రీగా కట్టబెట్టాలని నిర్ణయించారు. సినిమా సక్సెస్‌ అయ్యి వసూళ్లు సాధించినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు తమ వాటా తీసుకుని నిర్మాతకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దాంతో మహానాయకుడు సినిమాపై బాలయ్య కూడా చాలా వరకు నష్టపోయేలా కనిపిస్తోంది. రెండు పార్ట్‌లకు కలిపి బాలయ్య ఏకంగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశాడు అనేది సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందులో నిజం ఎంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.