ఎట్టకేలకు మహానాయకుడికి ముహూర్తం కుదిరింది... ఇదిగో వర్మ ఎక్కడున్నావ్‌  

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఏమాత్రం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయలేక పోయింది. ఇదే సమయంలో వారంతా కూడా మహానాయకుడు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మహానాయకుడు సినిమా అయినా తమ పెట్టుబడిని వెనక్కు తీసుకు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా భారీ ఎత్తున ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

NTR Mahanayakudu Release Date New Announcement-Ntr Biopic Ntr Rana

NTR Mahanayakudu Release Date New Announcement

మహానాయకుడు సినిమాను మొదట ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల చేయాలనుకున్నారు. కాని ధైర్యం సరిపోక కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు చేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ విడుదల తేదీని నిర్ణయించడం జరిగింది. వచ్చే వారంలోనే ఈ చిత్రంను ఎలాంటి హడావుడి లేకుండా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో డబ్బింగ్‌ మరియు రీ రికార్డింగ్‌ పనులు పూర్తి కాబోతున్నాయి. ఆ వెంటనే సెన్సార్‌కు వెళ్లబోతుంది.

NTR Mahanayakudu Release Date New Announcement-Ntr Biopic Ntr Rana

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ సినిమా ఫిబ్రవరి 22వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట ఈనెల చివర్లో అనుకున్నారు. కాని సినిమా విడుదలకు మరీ ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఒక వైపు ఎన్టీఆర్‌ కథానాయకుడు కు చాలా గ్యాప్‌ అవుతుందని, మరియు ఎన్నికలు సమీపిస్తున్నాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అతి త్వరలోనే మహానాయకుడు ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం మహానాయకుడును ప్రత్యేకంగా ట్రైలర్‌ ఏమీ ఉండదు అంటున్నారు. మరి సినిమాకు ట్రైలర్‌ లేకుండా విడుదల అవుతుందా లేదంటే ట్రైలర్‌ వస్తుందో చూడాలి.

ఈ సమయంలో వర్మ తన లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాడేమో చూడాలి.