'యాత్ర' దారిలో 'ఎన్టీఆర్‌ మహానాయకుడు'... డబ్బులు దండగ

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లు కూడా తీవ్ర నష్టాలను మిగిల్చాయి.ఇటీవల విడుదలైన ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం కూడా తీవ్ర నష్టాలను మిగిల్చింది.

 Ntr Mahanayakudu Movie Free Shows In Ap Like Yatra Movie-TeluguStop.com

మొదటి రోజే ఈ సినిమాకు అసలు కలెక్షన్స్‌ రాలేదు.ఒక స్టార్‌ హీరో సినిమాకు మినిమంగా అయిదు కోట్ల వసూళ్లు మొదటి రోజు నమోదు అవుతాయి.

కాని మహానాయకుడు చిత్రానికి మాత్రం కేవలం కోటి రూపాయలు మాత్రమే నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అత్యంత దయనీయ పరిస్థితి థియేటర్లలో కనిపిస్తుంది.

జనాలు రాక పోవడంతో, మరే సినిమాలు లేకపోవడంతో థియేటర్లు వెలవెల బోతున్నాయి.

ఇలాంటి సమయంలో ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ సినిమాను ఏపీలోని పలు ఏరియాల్లో ఫ్రీగా ప్రదర్శించేందుకు సిద్దం అయ్యారు.తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం సూచన మేరకు ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాను తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తల కోసం ప్రత్యేక షోలు వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు గొప్పదనం ఈ చిత్రంలో చూపించే విధంగా ఉంది.

అందుకే చంద్రబాబు అండ్‌ కో ఈ సినిమాను ప్రమోట్‌ చేయాలని భావిస్తోంది.ఇటీవల విడుదలైన ‘యాత్ర’ చిత్రాన్ని కొన్ని ఏరియాల్లో వైఎస్‌ఆర్‌ అభిమానుల కోసం ఉచితంగా వేయడం జరిగింది.

రెండు మూడు రోజుల పాటు ఆ ఫ్రీ షోలు సాగాయి.

యాత్ర ఫ్రీ షోల మాదిరిగానే ఇప్పుడు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ షోను కూడా వేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మహానాయకుడు సినిమాకు పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా వసూళ్లు నమోదు కాలేదు అంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఫ్రీ షోలు వేయడం అనేది డిస్ట్రిబ్యూటర్లకు మరింత భారంగా చెప్పుకోవచ్చు.

నిర్మాత డబ్బులు ఇప్పటికే తిరిగి వచ్చే పరిస్థితి లేదు.డబ్బులు దండగా అనుకుంటూ ఉండగా ఫ్రీ షోలు ఏంటీ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube