ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. ఆర్ఆర్ఆర్‌లో తారక్ లుక్‌పై క్లారిటీ!  

NTR Look From RRR To Be Out This Year, NTR, RRR, Rajamouli, Bheem, Ram Charan, First Look, Tollywood News - Telugu Bheem, First Look, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Tollywood News

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురచూస్తున్నారు.

TeluguStop.com - Ntr Look From Rrr To Be Out This Year

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా, ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు.

అయతే ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

TeluguStop.com - ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. ఆర్ఆర్ఆర్‌లో తారక్ లుక్‌పై క్లారిటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తారక్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే చరణ్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, తారక్ లుక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని చిత్ర వర్గాలు చూస్తున్నాయి.

కాగా లాక్‌డౌన్ కారణంగా కొమురం భీం లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేకపోయారు.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అయినా తారక్ లుక్ వస్తుందేమో అని అందరూ చూశారు.

కానీ అప్పుడు కూడా ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేయలేదు.

దీంతో ఇప్పట్లో తారక్ లుక్ ఉంటుందో లేదో అనే సందేహం సర్వత్రా నెలకొంది.

అయితే కొమురం భీం పాత్రలో తారక్ లుక్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారట చిత్ర యూనిట్.అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండటంతో, త్వరలోనే తారక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి తారక్ ఫస్ట్ లుక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ రిలీజ్ చేసే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

#Bheem #First Look #Ram Charan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Look From Rrr To Be Out This Year Related Telugu News,Photos/Pics,Images..