జక్కన్న కోసం పూర్తిగా లుక్ మార్చిన ఎన్ఠీఆర్..! వైరల్ అవుతున్న RRR వర్కింగ్ స్టిల్ ఇదే.!  

ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్‌ , చిరంజీవి ముఖ్య అతిథిలుగా వచ్చారు. అయితే జక్కన్న సినిమా అంటే షూటింగ్ కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో అనే సందేహం తెలుగు సినిమా అభిమానుల్లో కలిగింది.

Ntr Look Completely Changed For RRR Movie-Rajamouli Ram Charan Rrr Movie

Ntr Look Completely Changed For RRR Movie

అంతేకాదు ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ మాత్రమే కాదని అంటున్నారు సినీ వర్గాలు. అదేమిటంటే…‘రామ రావణ రాజ్యం’. .‘అరవింద సమేత’ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కాస్త స్లిమ్ గా కనిపించిన తారక్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ ని మార్చుకోవడానికి వర్కవుట్లు మొదలుపెట్టి కొద్దిరోజులే అవుతున్నా.. ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తరువాత అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయమని అంటున్నారు.

Ntr Look Completely Changed For RRR Movie-Rajamouli Ram Charan Rrr Movie

ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని కోకాపేట లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుపుకుంటుంది. కాగా ఈ షూటింగ్ స్పాట్ నుండి ఎన్టీఆర్ పిక్ బయటకొచ్చి వైరల్ గా మారింది.భారీకాయం మాత్రమే కాకుండా గుబురు గడ్డం కూడా పెంచి గెటప్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన సరికొత్త అప్డేట్ 12:12:12 న ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ అప్డేట్ సినిమాలోని హీరోయిన్స్ కు సంబంధించిందే అనుకుంట.