ఇలా అయితే ఆగస్టులో కష్టమే జూనియర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Ntr-koratala Movie Might Not Release In August-TeluguStop.com

గత నెలలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది.కాని ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రమోషన్‌తో బిజీగా ఉండటం వల్ల ఫిబ్రవరి 10 నుండి ప్రారంభిస్తాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఈనెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.

ఈనెల 10 నుండి జరగాల్సిన ఎన్టీఆర్‌ కొత్త సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యం కాబోతుందని, సెట్టింగ్‌ నిర్మాణం పూర్తి కానందున ఈనెల చివర్లో ప్రారంభిస్తాం అంటూ నిర్మాతలు ప్రకటించారు.

మరో వైపు దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ను మరింత బలంగా రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.‘మిర్చి’ మరియు ‘శ్రీమంతుడు’ చిత్రాల్లో ప్రభాస్‌ మరియు మహేష్‌బాబులను చాలా స్టైలిష్‌గా చూపించిన కొరటాల శివ ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ను మరింత స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు.

ఇక ఈ చిత్రం ఆగస్టులో విడుదల చేస్తాం అంటూ దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు.కాని రెండు నెలల ఆలస్యంగా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుండటంతో సినిమా సరైన సమయంకు విడుదల అవ్వడం కష్టమేనేమో అని కొందరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube