భీమ్‌ వీడియోతో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్న జక్కన్న  

Ntr Kommuram Bheem Rajamouli - Telugu Coronavirus, Kommuram Bheem, Ntr, Ntr Birthday, Rajamouli, Rrr

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అంటూ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగడం లేదు.

 Ntr Kommuram Bheem Rajamouli

గత రెండు నెలలుగా షూటింగ్‌ నిర్వహించక పోవడంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ముందుకు సాగలేదు.ఈ కారణంగానే సినిమా సంక్రాంతికి విడుదల కాబోవడం లేదని, వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో జక్కన్న అండ్‌ టీం అతి త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఉన్న విపత్తు నుండి బయట పడేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.

భీమ్‌ వీడియోతో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్న జక్కన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

షూటింగ్స్‌కు ఓకే చెప్పినా ప్రేక్షకులు థియేటర్ల దారి పట్టేందుకు భయపడుతున్నారు.అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సినిమా విడుదల విషయాన్ని అధికారికంగా చెప్పేందుకు జక్కన్న అండ్‌ టీం రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ బర్త్‌డేకు రావాల్సిన కొమురం భీమ్‌ వీడియోను లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే.ఎక్కువ ఆలస్యం చేయకుండా కొమురం భీమ్‌ వీడియోను విడుదల చేయాలని భావిస్తున్నారు.ప్రస్తుతం ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.

కొమురం భీమ్‌ వీడియో విడుదల చేసిన సమయంలోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అనుకుంటున్నారు.అలాగే కొత్త విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test