కొత్త రికార్డులు సృష్టించిన తారక్.. సంతోషంలో ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.గతంలో టాలీవుడ్ లో ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

 Ntr  Komaram Bheem Treaser Creats New Records, Jr Ntr, Ram Charan, Rajamouli, Ba-TeluguStop.com

గత నెల 22వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ టీజర్ వేగంగా 30 మిలియన్ల వ్యూస్ ను అందుకున్న మొదటి టాలీవుడ్ టీజర్ గా నిలిచింది.

ఈ రికార్డుతో పాటు లక్ష కామెంట్లు పొందిన తొలి టీజర్ గా మరో రికార్డు సాధించింది.

ఎన్టీఆర్ సాధించిన రికార్డుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంతో ఉన్నారు.

దీపావళి పండగ రోజున ఎన్టీఆర్ టీజర్ రికార్డుల గురించి వస్తున్న వార్తలు తమ ఆనందాన్ని రెట్టింపు చేశాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డును సెట్ చేయడం భవిష్యత్తులో విడుదల కాబోయే ఏ టీజర్ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Telugu Komarambheem, Rajamouli-Movie

దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో పీరియాడికల్ సినిమాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది.ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్నారు.2021 సమ్మర్ లేదా దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా కలెక్షన్లతో సైతం కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ను తీసుకుని ఫిక్షనల్ కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చరిత్రకు సంబంధించిన సినిమానే అయినప్పటికీ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని సమాచారం.అటు రామ్ చరణ్ కెరీర్ లో, ఇటు ఇటు ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఇరు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube