మళ్లీ ఎంట్రీ ఇస్తున్న భీం.. టైమ్ ఫిక్స్ చేసిన జక్కన్న!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు.

 Ntr Komaram Bheem New Poster Release Tomorrow, Ntr, Komaram Bheem, Rrr, Rajamoul-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

వారి లుక్స్‌కు సంబంధించిన టీజర్లు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదో ఒక అప్‌డేట్ ఉండబోతుందని గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయకపోవడంతో, ఇక ఎలాంటి అప్‌డేట్ ఉండబోదని అందరూ అనుకున్నారు.కానీ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర టీమ్ ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

తారక్ పుట్టినరోజు కానుకగా భీం పాత్రకు సంబంధించి మరో సర్‌ప్రైజ్ మే 20న ఉదయం 10 గంటలకు ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక ఈ సినిమాలో తారక్ సరసన ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, ఆయన సరసన సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మెగా మూవీని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చూసినా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడింది.మరి తారక్ బర్త్‌డే కానుకగా రాబోయే ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube