ఆమెతో రొమాన్స్‌కే తారక్ మొగ్గు..?  

Ntr Keen To Romance Rashmika - Telugu Kalyan Ram, Ntr, Ntr30, Rashmika, Telugu Movie News, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ntr Keen To Romance Rashmika - Telugu Kalyan Ram, Ntr, Ntr30, Rashmika, Telugu Movie News, Trivikram-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను వచ్చే జనవరి 8వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేశాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తారక్ అనౌన్స్ చేశాడు.ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పూజా హెగ్డేతో ఇంతకుముందే అరవింద సమేతలో నటించిన తారక్, ఈ సారి కన్నడ బ్యూటీ రష్మికతో రొమాన్స్ చేయాలని చూస్తున్నాడట.

ఇటీవల మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో అమ్మడి యాక్టింగ్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులకు తారక్ ముచ్చటపడి ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడట.దీంతో రష్మికను ఈ సినిమాను హీరోయిన్‌గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

తాజా వార్తలు

Ntr Keen To Romance Rashmika-ntr,ntr30,rashmika,telugu Movie News,trivikram Related....