ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ లో ఆ రెండు సీన్లే హైలైట్ అంట.! అవేంటో చూడండి!     2019-01-09   09:54:54  IST  Sai Mallula

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది. తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది. తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనుంది.

Ntr Kathanayakudu Movie Highlight Scenes-Director Krishna Highlight Scenes Ntr Bio Pic Tdp Party Announcement

Ntr Kathanayakudu Movie Highlight Scenes

ఈ సినిమాలో హైలైట్ అంటే ఆ రెండు సన్నివేశాలే అంటూ సినీ అభిమానులు చెప్పుకుంటున్నారు. అందులో ఒకటి దివిసీమ ఉప్పెన సన్నివేశం కాగా మరొకటి ముగింపులో వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రకటన సన్నివేశమట. ఈ రెండు సీన్లు మంచి భావోద్వేగాలతో చక్కగా కుదిరాయని, సినిమాకే హైలెట్ అవుతాయని అంటున్నారు సినిమాను వీక్షించినవారు.

Ntr Kathanayakudu Movie Highlight Scenes-Director Krishna Highlight Scenes Ntr Bio Pic Tdp Party Announcement

సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు. కొద్దిసేపు మన చూసేది నిజంగా ఎన్.టి.ఆర్ అనేలా బాలయ్య కనిపిస్తారు. మొత్తం 60 పాత్రల దాకా బాలయ్య ఈ సినిమాలో చేశారు. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చూపించారు. బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.