‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మొదటి రోజు కలెక్షన్స్‌... ఇన్నాళ్ల కెరీర్‌ లో బాలయ్య అక్కడ నిలిచాడు  

Ntr Kathanayakudu Movie First Day Collections-director Krish,ntr Kathanayakudu Movie,ntr Kathanayakudu Movie Review

Apart from Telugu Telugu audiences, the 'NTR' hero of the film has come up with a lot of interest in the Telugu people around the world yesterday. In addition to directing Krrish, NTR has got positive talk to Balayya for a lot of services.

.

In the film, Balayya made two flags of the film, making it 100 crore business. Some of the bosses of the movie Balayya are some nonsense. But if the film is open, the two part distributors will be able to make huge profits. . Smaller heroes also fall into overseas during this period. But Balakrishna drank three ponds to get a million mark. This time, however, it is likely to earn a million mark of $ 2 million and $ 2 million. Trading sources say that the film is likely to be a long run when the first day approaching $ 1 million. In the Telugu states too, this film is going to get bigger openings in Balayya's career. .

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. క్రిష్‌ దర్శకత్వంతో వహించడంతో పాటు, ఎన్టీఆర్‌ పలు గెటప్స్‌కు బాలయ్య బాగా సూట్‌ అయ్యాడంటూ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది..

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మొదటి రోజు కలెక్షన్స్‌... ఇన్నాళ్ల కెరీర్‌ లో బాలయ్య అక్కడ నిలిచాడు-NTR Kathanayakudu Movie First Day Collections

బాలయ్య కెరీర్‌లోనే రెండు పార్ట్‌లు కలిపి ఏకంగా 100 కోట్ల బిజినెస్‌ను ఈ చిత్రం చేసింది. బాలయ్య సినిమా వంద కోట్లు ఏంటీ బాసూ అంటూ కొందరు ముక్కున వేలేసుకున్నారు.

కాని ఈ చిత్రం ఓపెనింగ్స్‌ చూస్తుంటే రెండు పార్ట్‌ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలను తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. .

చిన్న హీరోలు కూడా ఈమద్య కాలంలో ఓవర్సీస్‌లో దున్నేస్తున్నారు. కాని బాలకృష్ణ మాత్రం మిలియన్‌ మార్క్‌ అందుకునేందుకు మూడు చెరువుల నీళ్లు తాగుతున్నాడు.

అయితే ఈసారి మాత్రం మిలియన్‌ మార్క్‌ ఏం ఖర్మ, ఏకంగా రెండు లేదా రెండున్నర మిలియన్‌ల డాలర్లను కూడా వసూళ్ల చేసే అవకాశం కనిపిస్తోంది. మొదటి రోజే ఏకంగా మిలియన్‌ డాలర్లకు చేరువ అవ్వడంతో ఈ చిత్రం లాంగ్‌ రన్‌ లో కుమ్మేయనుందంటూ ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో హిట్‌ సినిమాలు లాంగ్‌ రన్‌ లో 30 లేదా 40 కోట్ల వరకు రాబట్టేవి. కాని ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మాత్రం ఏకంగా మొదటి వారంలోనే ఆ మార్క్‌ను క్రాస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. సునాయాసంగా 50 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబడుతుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఇంతటి అద్బుత ఓపెనింగ్స్‌ దక్కించుకున్న ఎన్టీఆర్‌కు ముందు ముందు సంక్రాంతి సెలవులు కావున భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. నేడు, రేపు, ఆ తర్వాత విడుదలయ్యే సినిమా ఫలితాలను బట్టి ఈ సినిమా కలెక్షన్స్‌ ఉంటాయి.

మరి ఆ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.