అమెజాన్ ప్రైమ్ లో ఎన్టీఆర్ కథానాయకుడు!  

  • నట దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథతో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఎన్టీఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం కథానాయకుడు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బయ్యర్లకి భారీగా నష్టాలు మిగిల్చింది.

  • ఈ నేపధ్యంలో రెండో భాగమైన మహానాయకుడు విషయంలో దర్శకుడు క్రిష్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ రీషూట్ మొదలెట్టాడు. ఇదిలా వుంటే కథానాయకుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా కాకుండానే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి వచ్చేసింది. ఈ నెల 8వ తేదీనా ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్స్ లో తేలిపోయిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎ రేంజ్ లో ఆకట్టుకుంటుంది చూడాలి.