బాబాయి కోసం గిఫ్ట్ రెడీ చేస్తోన్న అబ్బాయిలు

నందమూరి బాలకృష్ణ జూన్ 10న తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు బాలయ్య కోసం చాలా బహుమతులను రెడీ చేస్తున్నారు.

 Ntr Kalyan Ram Gift To Balakrishna, Ntr, Kalyan Ram, Balakrishna, Tollyood News-TeluguStop.com

కాగా తన అభిమానులను ఈ వేడుకలు ఘనంగా జరపవద్దంటూ బాలయ్య ఇప్పటికే కోరాడు.అయితే బాలయ్య కోసం నందమూరి హీరోలు సైతం అదిరిపోయే బహుమతులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్‌‌లు తమ బాబాయి బాలయ్య బాబుతో బాగా సన్నిహితంగా ఉంటున్నారు.వారు తమ సినిమాల ప్రమోషన్స్‌కు బాలయ్యను తరుచూ ఆహ్వానిస్తున్నారు.కాగా ప్రస్తుతం బాలయ్య బర్త్‌డే వస్తుండటంతో ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని వారు చూస్తున్నారు.దీని కోసం వారు గిఫ్ట్‌ను రెడీ చేసే పనిలో కూడా పడ్డారట.అయితే ఈ గిఫ్ట్ ఏమిటనేది ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త పడుతున్నారు.

మొత్తానికి బాలయ్య బర్త్‌డేను సంథింగ్ స్పెషల్‌గా ఉంచాలని నందమూరి యంగ్ హీరోలు ఏదో ప్లానింగ్ చేస్తున్నారని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.మరి ఈ సంథింగ్ స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్ ఏమిటో తెలియాలంటే మాత్రం జూన్ 10 వరకు ఆగాల్సిందే.

ఇక బాలయ్య ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube