టీడీపీని, జూనియ‌ర్‌ను క‌ల‌ప‌నున్న ఎన్టీఆర్ ?

హైద‌రాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లోని ఓ చిన్న గ‌దిలో కేవ‌లం 40మందితో 1982 మార్చి 29న టీడీపీ ఏర్పాటైంది.నేటికీ నాలుగు ద‌శాబ్ధాలుగా పార్టీ జెండా ఎగ‌రేయ‌డం అంటే ఆశామాశీ కాదు.

 Ntr Is Reason For Tdp And Junior Ntr Meets  , Junior Ntr , Nandmuri Family , Tdp-TeluguStop.com

ఇక జాతీయ‌స్థాయిలో ఓ రేంజ్‌లో వెలుగొందిన టీడీపీ నేడు కొంత వెన‌క్కి త‌గ్గినా రానురాను జోరందు కుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.ఎందుకంటే ఈ ఏడాది టీడీపీకి కీల‌క‌మైంది.

పార్టీ ఇయ‌ర్స్ పార్టీ సెల్ర‌బేష‌న్స్ కు అన్ని ఏర్పాట్లు చేయ‌నున్నారు.ఇదే ఏడాది మే 28న నంద‌మూరి న‌ట సార్వ‌భౌములు, రాజ‌కీయ దురంధుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌ జ‌యంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి.ఇది టీడీపీకి, టీడీపీ త‌మ్ముళ్ల‌కు పెద్ద పండ‌గ‌నే చెప్పాలి.40 ఏండ్ల పార్ట ఆవిర్భావ వేడుక‌లతో పాటు, ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు అట్ట‌ హాసంగా నిర్వ‌హించేందుకు టీడీపీ సిధ్ద‌ప‌డుతోంది.ఇదే జోష్తో ఏపీలో టీడీపీని ప‌రుగులు పెట్టించేందుకు, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇందులో భాగ‌స్వామ్యం చేసేందుకు చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్న‌ట్టు తెలిసింది.

ఇదే ఏడాది మార్చి 29న టీడీపీ 40వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ గండిపేట వ‌ద్ద భారీ ఎత్తున కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు.

అలాగే మే 27, 28, 29 తేదీల్లో మ‌హానాడును అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు కూడా స‌న్నాహాలు చేస్తున్నారు.ఎందుకంటే 2018 అనంత‌రం ఒక్క‌సారి కూడా మ‌హానాడు నిర్వ‌హించ‌లేదు.2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌రువాత టీడీపీ స్థ‌బ్ధుగా మారింది.అనంత‌రం 2021లో కరోనా రావ‌డం జూమ్ మీటింగ్‌ల‌కే బాబు ప‌రిమితం కావ‌డం విధిత‌మే.

ఈసారి ఎలాంటి అడ్డంకులు లేక‌పోవ‌డంతో మ‌హానాడు నిర్వ‌హిస్తార‌ని టాక్‌.అయితే బాల‌కృష్ణ ఇందులో ఎలాగు పాలుపంచుకోర‌ని, నంద‌మూరి కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇందుకు సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి క‌లిసొస్తుంద‌ని అంచ‌నా.

మొత్తానికి నంద‌మూరి ఫ్యామిలీ తామంతా ఒక్క‌టే అన్న నినాదం తెర‌పైకి తీసుకొచ్చి క్యాడ‌ర్‌లో జోష్ పెంచాల‌ని భావిస్తున్నారు.మ‌హానాడుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ అటెండ్ అయితే ఇక టీడీపీకి క‌లిసొచ్చే అంశ‌మే అవుతుంది.2024 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచేందుకు కూడా దోహ‌ద‌ ప‌డ‌తాడ‌ని విశ్లేష‌కుల అంచ‌నా.అందుకే సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏపీ మొత్తం ఏడాది పాటు జ‌రిపాల‌ని, జాత‌ర‌ను త‌ల‌పించాల‌ని టీడీపీ ప్లాన్ వేస్తున్న‌ట్టు స‌మాచారం.అంటే 2023 నాటికి టీడీపీ జోష్ పెరిగితే మ‌రోసారి టీడీపీ ఓ వెలుగువెలుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Will Jr NTR join Naidu's plan for Sr NTR Birth Centenary?

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube