ఎన్టీఆర్ కూడా తన సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతున్నాడా....

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోలు ఒక పక్క తమ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారాల్లో బాగానే రాణిస్తున్నారు.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, నాగార్జున, బాలకృష్ణ వంటి తదితర హీరోలు సినిమాలతో పాటూ సినిమా ప్రొడక్షన్ హౌస్ లను సొంతగా నిర్మించుకున్నారు.

 Ntr Is Also Going To Build Its Own Production House-TeluguStop.com

అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఇందుకుగానూ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సలహా తీసుకున్నాడట.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో వీరిద్దరి స్నేహ బంధం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.ఎన్టీఆర్ ఈ ప్రొడక్షన్ హౌస్ కి “భార్గవ్ హరి ప్రొడక్షన్” అని నామకరణం చేయబోతున్నారని ఎన్టీఆర్ సన్నిహితవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Telugu Bargav Hari, Jrntr Latest, Ntr Build, Ram Charan Rrr-Movie

అయితే తాజాగా ఎన్టీఆర్ తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (జక్కన్న) దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్ గణ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అప్పట్లో స్వాతంత్య్రం  కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి వీరుల విజయగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube