త్రివిక్రమ్‌కు తారక్ ఝలక్.. నెక్ట్స్ మూవీ లేనట్టే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో యమ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను వచ్చే జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

 Ntr Interested For Movie With Vetrimaran Before Trivikram-TeluguStop.com

ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకునేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.కాగా తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తెరకెక్కించనున్నట్లు గతంలో తారక్ వెల్లడించాడు.

అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్‌తో సినిమా ఉండబోదని సినీ వర్గాలు అంటున్నాయి.ఇటీవల తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ తారక్‌కు ఓ అదిరిపోయే కథను వినిపించాడట.

ఈ కథ తారక్‌కు బాగా నచ్చడంతో వెట్రిమారన్‌తో ఖచ్చితంగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.అయితే ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్‌తో కాకుండా వెట్రిమారన్‌తో సినిమా చేయాలని తారక్ తాజాగా ఫిక్స్ అయినట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్, తన నెక్ట్స్ ప్రాజెక్టును తారక్‌తో తీసేందుకు రెడీ అవుతున్నాడు.మరి త్రివిక్రమ్‌కు తారక్ హ్యాండిస్తాడా లేక ఆయనతోనే సినిమాను కానిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube